వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ మాజీ సర్పంచ్‌లు చేరిక..టీడీపీ పాలనలో విసిగిపోయాం..
వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రానికి మంచిరోజులు..
విజయనగరంః వైయస్‌ఆర్‌సీపీలోకి రాష్ట్రవాప్తంగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం చిన కుదుమ,పెద కుదమలకు చెందిన టీడీపీ మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వైయస్‌ జగన్‌ వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ పాలన చూసి విసిగిపోయామని, గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడంలేదని వారు మండిపడ్డారు. టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలేదన్నారు. రాజన్న బిడ్డగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తారనే నమ్మకంతో వైయస్‌ జగన్‌తో కలిసి నడించేందుకు ముందుకు వచ్చామన్నారు.మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా వైయస్‌ జగన్‌ రాష్ట్రానికి న్యాయం చేస్తారన్నారు.టీడీపీ ఎన్ని కుట్రలు పన్నుతున్న ధైర్యంగా ఎదుర్కొని ప్రజల కోసం  వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు.నవరత్నాలు పథకాలు ద్వారా జననేత తమకు మేలు చేస్తారనే సంపూర్ణ నమ్మకంతో ప్రజలు ఉన్నారన్నారు.ఇళ్లు,పెన్షన్లు,నిరుద్యోగ భృతి వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచడంలో చంద్రబాబు విఫలయాయ్యరన్నారు.టీడీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.ప్రజల పక్షాన పోరాడుతున్న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలిసి నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

Back to Top