వైయస్‌ఆర్‌సీపీలోకి టీడీపీ కార్యకర్తలు చేరిక..




తూర్పుగోదావరిః జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముమ్మిడివరం మండలానికి చెందిన వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పొన్నాడ సతీష్‌కుమార్‌ సమక్షంలో పార్టీలోకి చేరారు. వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు మోసపూరిత వైఖరి పట్ల నచ్చక వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నట్లు కార్యకర్తలు తెలిపారు.వచ్చే ఎన్నికల్లో పొన్నాడ సతీష్‌కుమార్‌ గెలుపునకు కృషి చేస్తామన్నారు. మహిళలంతా వైయస్‌ఆర్‌సీపీ వెంటే ఉన్నారన్నారు.
 


Back to Top