దుగ్గిరాలలో టీడీపీ నేతల దౌర్జన్యం

గుంటూరుః అధికారాన్ని అడ్డం పెట్టుకొని పచ్చతమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. దుగ్గిరాలలో టీడీపీ నేతల అరాచకానికి హద్దులు లేకుండా పోయింది. మండల ఉపాధ్యక్షుడి ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. ఎన్నికల అధికారి కృష్ణదేవరాయను నిర్బంధించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు. టీడీపీ నేతలు, పోలీసుల తీరుపై వైయస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మొత్తం 18 మంది ఎంపిటిసి సభ్యుల్లో వైయస్సార్సీపీకి 11 మంది మద్దతు ఇచ్చారు.

Back to Top