టీడీపీకి షాక్‌

 

  
 


 శ్రీకాకుళం: అనంతపురం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ గని శనివారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అబ్దుల్‌ గని పార్టీలో చేరారు. గత నాలుగున్నరేళ్ల పాలనలో మైనారిటీలకు చంద్రబాబునాయుడు చేసేందేమీ లేదని ఈసందర్భంగా అబ్దుల్‌ గని పేర్కొన్నారు.

టీడీపీలో 30 ఏళ్లుగా తాను సేవలు అందించినా.. ప్రాధాన్యత కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డిదేనని గుర్తు చేశారు.  వైయ‌స్ఆర్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు లబ్ధిపొందారని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్‌ నేత వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం.. ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారింది. 


Back to Top