లీజు లింకు అందుకే అన్న మాట‌

ముఖ్య‌మంత్రి
చంద్ర‌బాబు నాయుడు మంత్రి వ‌ర్గ స‌మావేశంలో భూముల లీజు గ‌డువును 33
సంవ‌త్స‌రాల నుంచి 99 సంవ‌త్స‌రాల‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో
అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మంత్రులు ప్ర‌క‌టించారు. 
రాజ‌ధాని
పేరుతో పెద్ద ఎత్తున భూముల్ని లాక్కొంటున్న ప్ర‌భుత్వం ఈ భూముల్ని ఏం
చేయ‌బోతోంది అనే దాని మీద స్ప‌ష్ట‌త లేదు. రాజ‌ధాని భ‌వంతులు అంటే మ‌హా
అయితే 2,3 వేల  ఎక‌రాల్లో పూర్తి అవుతాయని అంద‌రూ చెబుతున్నారు. అయినా
స‌రే, 50 వేల ఎక‌రాల భూముల్ని లాక్కోవ‌టంలోని ఆంత‌ర్యం అంతు ప‌ట్ట‌డం లేదు.
త‌క్కువ
కాలానికి లీజు ఇచ్చిన‌ట్ల‌యితే సింగ‌పూర్ కంపెనీల‌కు స‌రిప‌డినంత
ప్ర‌యోజ‌నాలు ద‌క్క‌వ‌ని బినామీలు భావిస్తున్నారు. అందుకే స్వ‌ల్ప కాలానికి
లీజు ఇవ్వ‌కుండా త‌ర త‌రాల‌కు లీజులు ఇచ్చేందుకు ఈ విధ‌మైన నిర్ణ‌యం
తీసుకొన్నార‌న్న మాట వినిపిస్తోంది. సింగ‌పూర్ కంపెనీల‌కు అన్ని విధాలా
భూముల్ని దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం వెలువ‌డింది. 
Back to Top