ఓటమి భయంతోనే టీడీపీ దాడులు

నంద్యాల: ఓటమి భయంతోనే తెలుగు దేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. పోలింగ్‌ చివరి నిమిషంలో నంద్యాల పట్టణంలోని వైయస్‌ఆర్‌సీపీకి చెందిన మైనార్టీ నేతలపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న శిల్పా తన వర్గీయులను శాంతింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత ఎన్నికల్లో కూడా భూమా నాగిరెడ్డి చివరి క్షణంలో ఇలాగే గొడవలు సష్టించారన్నారు. ఈ సారి ఆయన వర్గీయులు మైనారిటీ నేతలే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి దగ్గరుండి మరి మైనారిటీలను కొట్టించారని ధ్వజమెత్తారు. ఏవీపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కౌన్సిలర్‌పై దాడి చేయడం దారుణం దారుణమని ఖండించారు. 

Back to Top