‘బాబు చేతిలో మోసపోయామన్నా...’
- వైయ‌స్ జ‌గ‌న్ ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేసిన యువ‌కుడు
- టీడీపీ స‌భ్య‌త్వ కార్డు చించివేత‌
ప‌శ్చిమ గోదావ‌రి: మట్టి నుంచి మరుగుదొడ్ల దాకా అన్నింటా అవినీతికి పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, లేనిపక్షంలో నెలకు 2 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నఅబద్ధపు వాగ్ధానాలను గుర్తుచేసుకుంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)పై జనం మండిపడుతున్నారు. వాణిజ్య సదస్సుల ద్వారా వేల కోట్ల  పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు సాధించామని సొంత డప్పుకొట్టుకుంటున్న ఏపీ సీఎం తీరును యువత ఎక్కడిక్కడే ప్రశ్నిస్తున్నారు. ‘బాబు చేతిలో మోసపోయామన్నా...’ అంటూ జననేతకు గోడు చెప్పుకుంటున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  176వ రోజు  బుధ‌వారం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో  కొన‌సాగుతోంది.  కొప్పర్రు శివారులో మురళీకృష్ణ అనే టీడీపీ కార్యకర్త జననేతను కలుసుకుని తన కష్టాన్ని చెప్పుకున్నాడు. ‘చంద్రబాబూ చూడు..’ అంటూ టీడీపీ సభ్యత్వ కార్డును చింపేసి, నేలకేసి కొట్టాడు.  విజయవాడకు చెందిన ముర‌ళీకృష్ణ  భీమవరంలోని  బంధువుల జ్యూస్‌ షాప్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. టీడీపీని నమ్మి మోసపోయాడు. జెండాలు కట్టడం దగ్గర్నుంచి అన్ని పనులూ చేశాడు. చదువుకున్న త‌న‌కు ఏదో ఒక బతుకుదెరువు చూపిస్తారని ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే టీడీపీ నాయకులు.. డబ్బులిస్తేనేగానీ ఉద్యోగం లేదని అంటున్నారు. మూడు లక్షలు ఇస్తే విజయవాడ కార్పొరేషన్‌లోనో, మంగళగిరి రిజిస్ట్రేషన్‌ ఆఫీసులోనో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం పెట్టిస్తామని చెబుతున్నారు. నా దగ్గర అంతస్థోమత లేదు..’’ అంటూ ఆ యువకుడు వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. అత‌ని స‌మ‌స్య‌ను విన్న వైయ‌స్ జ‌గ‌న్ ధైర్యం చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక మురళీకృష్ణ లాంటి తమ్ముళ్లందరికీ న్యాయం దక్కుతుందని వైయ‌స్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

Back to Top