పచ్చనేతలకు అంత సీన్ లేదు..!

విజయవాడః వైఎస్సార్సీపీ నేత తమ్మినేని సీతారాం ప్రభుత్వ వ్యవహారశైలిపై మండిపడ్డారు. తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధాటిని తట్టుకోలేకే చంద్రబాబు దీక్షను అడ్డుకున్నారని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. స్పెషల్ స్టేటస్ కోసం పోరాడే దమ్ము అధికార తెలుగుదేశం పార్టీకి లేదని ఎద్దేవా చేశారు.

ప్రత్యేకహోదాపై సీఎం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని సీతారాం ధ్వజమెత్తారు. హోదాపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేకహోదాను సాధించుకునేదాకా తాము విశ్రమించబోమన్నారు. ఆంధ్రుల హక్కు ప్రత్యేకహోదా అని విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో తమ్మినేని నినదించారు. 
Back to Top