ప్రజల దాహార్తిని తీర్చండిఃఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ..సభలో సంబంధింత మంత్రిని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కర్నూలులోని జనాభాకు ప్రధాన తాగువనరు సుంకేశుల బ్యారేజ్ అని  ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. సుంకేశులలో ప్రస్తుతం ఉన్న  .4 టీఎంసీల నీరు నెలరోజులకు మాత్రమే సరిపోతుందన్నారు. తుంగభద్ర నుంచి రాష్ట్రానికి  1 టీఎంసీ నీరు రావాల్సి ఉన్నందున దాన్ని రప్పించి ప్రజల దాహార్తిని తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Back to Top