ఎమ్మెల్యే రోజా అక్రమ సస్పెన్షన్ మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: అసెంబ్లీ
నుంచి ఎమ్మెల్యే రోజా ను అక్రమంగా సస్పెన్షన్ చేసిన కేసు సంబంధించిన పిటిషన్ ను సుప్రీంకోర్టు
స్వీకరించింది. దీని మీద వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యాలయాలకు
నోటీసులు ఇచ్చింది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. విచారణ ను ఈ నెల 21 కు
వాయిదా వేసింది.

ఈ సమయంలో డివిజన్
బెంచ్ ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ
నిబంధనావళి 340(2) కింద సస్పెండ్ చేశామని చెబుతూనే, మళ్లీ 194 కింద చర్యలు
తీసుకొంటున్నామని చెప్పటం ఎంత వరకు సబబని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక వైపు సభా
హక్కుల కమిటీ నోటీసులు ఇస్తుండగానే, నిబంధన 340(2) కింద సస్పెండ్ చేయటం ఎలా సాధ్యం
అని అభిప్రాయ పడింది. 

Back to Top