శుక్రవారం షర్మిల యాత్ర గుంటూరు నగరంలో...

గుంటూరు:

దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం గుంటూరు నగరంలో సాగుతుందని పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి హౌసింగ్‌ బోర్డు కాలనీ, చుట్టుగుంట, వెంకటప్పయ్య కాలనీ నాలుగో లైన్, మున్సిపల్‌స్కూల్, వికలాంగుల కాలనీ, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, అచ్చయ్య దాబా సెంటర్, రామనామ క్షేత్రం, నల్లచెరువు వేంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం నల్లచెరువు మెయిన్‌రోడ్, ఏటుకూరు క్రాస్‌రోడ్, ఎస్.కె.పి.ఆలయం, పూలమార్కెట్, జిన్నా టవర్ మీదుగా మాయాబజార్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం పొన్నూరు రోడ్, బీఆర్‌స్టేడియం, సంగడిగుంట మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.

Back to Top