పట్టిసీమ ప్రాజెక్ట్‌లో అవినీతికి తలుపులు తెరిచారని పార్టీ ప్రధాన కార్యదర్శి సుజయకృష్ణ రంగారావు ఆదివారం విమర్శించారు. ఇందులో 20 శాతం అదనంగా కమిషన్‌లు నొక్కేయడానికి టీడీపీ ప్రభుత్వం సన్నద్ధాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇసుక, ధాన్యం కొనుగోలు విధానాలు ప్రవేశపెట్టి రూ.కోట్లలో అవినీతికి పాల్పడుతున్నారని రంగారావు దుయ్యబట్టారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి పీతల సుజాత నియోజక వర్గంలో అత్యంత అవినీతి జరిగిందని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేకు ఏసీడీపీ నిధులు ఇవ్వకపోవడం వల్ల తాగునీరు, రహదారులు వంటి కనీస అభివృద్ధి కార్యక్రమాలకు మోక్షం కలగడం లేదని ఆయన వాపోయారు.