టీడీపీ ఎమ్మెల్సీ వేధింపులు తాళలేక ఆత్మహత్య

విజయవాడ : టీడీపీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ వేధింపులు తాళలేక వై.వెంకటరమణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్పై చర్యలు తీసుకోవాలంటూ వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంబంధం లేని విషయంలో రాజేంద్రప్రసాద్ గత మూడు రోజులుగా వెంకటరమణను వేధింపులకు గురి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Back to Top