గడ్డికి నిలయంగా రాజధాని

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు
విజయవాడ: అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అని టీడీపీ నేతలు ప్రకటించారని, ఇప్పుడు పశువులు మేపుకునే గడ్డి మైదానాలుగా మారిపోయాయని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు ఎద్దేవా చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని గడ్డికి నిలయంగా మారిందని తెలిపారు. అమరావతిలో గడ్డి దొరుకుతుందని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే అంటున్నారని గుర్తు చేశారు. ది కూడా చంద్రబాబు ఘనతే అని టీడీపీ నేతలు చెప్పుకోవడం విచిత్రంగా ఉందని సుధాకర్‌బాబు విమర్శించారు.
 
Back to Top