రోడ్డు లేదు..కనీసం వీధి లైట్లు కూడా లేవన్నా..




వైయస్‌ జగన్‌కు విద్యార్థుల మొర..
శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌ను కలిసి వీరఘట్టం మండలం అంకంపేటకు చెందిన విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు. స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని వైయస్‌ జగన్‌కు తెలిపారు. స్కూల్‌కు వెళ్లడానికి మెయిన్‌ రోడ్డు వరుకు ప్రతిరోజు సుమారు కిలోమీటరు నడుస్తామన్నారు. వర్షం వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అలాగే రాత్రి పూట వీధులైట్లు కూడా లేవన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం చలించలేదన్నారు. బస్సులు కూడా సమయపాలన పాటించడం లేదన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే బస్సు కూడా ఆపడంలేదన్నారు. ప్రీ స్టూడెంట్‌ పాసులుంటే ఆర్టీసీ బస్సు నిలుపుదల చేయరా అంటూ  ప్రశ్నించారు. గ్రామంలో అపారిశుధ్యం తాండవిస్తోందని కుళాయిలు వద్ద అపరిశ్రుభంగా ఉండటంతో తాగునీటికి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.వైయస్‌ జగన్‌ వస్తే మంచి రోజులు వస్తాయన్నారు. సమస్యలు పరిష్కరిస్తానని వైయస్‌ జగనన్న భరోసా ఇచ్చారని విద్యార్థులు తెలిపారు.
 
Back to Top