వెల్‌కం జ‌గ‌న‌న్న‌



-  వైయ‌స్ జ‌గ‌న్‌కు విద్యార్థుల అపూర్వ స్వాగ‌తం
- రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో ఉప్పొంగిన అభిమానం

అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు చిన్నా, పెద్దా తేడా లేకుండా మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ జ‌గ‌న్ 33వ రోజు రాప్తాడు నియోజకవర్గం చిన్నంపల్లి క్రాస్‌ రోడ్  ప్రారంభించారు. కూరుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్‌ రోడ్డు మీదుగా కూరుకుంట ఎస్సీ కాలనీకి చేరుకొని. అక్కడ ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు.  వైయ‌స్ఆర్ కాల‌నీ వ‌ద్ద పాఠ‌శాల విద్యార్థులు ఒక్క‌సారిగా రోడ్డుపైకి వ‌చ్చి క్ర‌మ‌శిక్ష‌ణ‌గా వ‌రుస క్ర‌మంలో నిలిచి జ‌న‌నేత‌ను క‌లిశారు. వారిని వైయ‌స్ జ‌గ‌న్ ఆప్యాయంగా ప‌ల‌క‌రించి, యోగ‌క్షేమాలు అడిగారు. మీ చ‌దువుల బాధ్య‌త నాదే అని, మీరంతా క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి ప్ర‌యోజ‌కులు కావాల‌ని ఆక్షాంక్షించారు. వైయ‌స్ జ‌గ‌న్‌తో ఫోటో దిగేందుకు, క‌ర‌చాల‌నం చేసేందుకు విద్యార్థులు పోటీ ప‌డ్డారు. అంద‌రిని ప‌ల‌క‌రిస్తూ జ‌న‌నేత ముందుకు సాగారు. కొంత దూరం విద్యార్థులు కూడా వైయ‌స్ జ‌గ‌న్‌తో అడుగులో అడుగు వేశారు.  అభిమాన నాయ‌కుడిని ద‌గ్గ‌ర నుంచి చూశామ‌న్న సంతృప్తితో విద్యార్థులు స్కూల్‌కు వెళ్లారు.  
Back to Top