బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

గుంటూరు: ఫిరాంగిపురం కొండల్లో మైనింగ్‌ బ్లాస్ట్‌ జరిగి ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, క్రిస్టినాలు ఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top