స్థానిక ఎన్నికలలో అన్ని కులాలకూ సమ ప్రాధాన్యం

హైదరాబాద్, 17 మే 2013:

స్థానిక ఎన్నికల్లో అన్ని కులాలకు సమానమైన ప్రాధాన్యతనివ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సూచించారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న తన నివాసంలో శుక్రవారం ఏర్పాటైన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేసి జైలులో ఉంచారనే విషయాన్ని ప్రజలకు చాటిచెప్పాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీ జగన్ అరెస్టయ్యి ఈనెల 27 వ తేదీకి ఏడాదవుతున్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు.  ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. శ్రీ జగన్మహన్ రెడ్డిపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ప్రజలకు చాటిచెప్పాలని సూచించారు. పార్టీకి ఈఏడాది ఎంతో కీలకమనీ, అందరూ సమష్టిగా పనిచేయాలని కోరారు. స్థానిక సమస్యలపై తక్షణం స్పందించాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికలు సెమీ ఫైనల్సు వంటివన్నారు. నాయకుల నుంచి కార్యకర్తల వరకూ అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇద్దామని చెప్పారు. ఒక్క రోజు కూడా వృథా కాకుండా నాయకులు ప్రజల్లోనే ఉండాలన్నారు.

Back to Top