స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌ప‌రం చేసే కుట్ర‌

- స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి
-  వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
విశాఖ‌:  నష్టాలను బూచిగా చూపి స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలని ప్ర‌భుత్వం కుట్ర చేస్తుంద‌ని విశాఖ‌ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శ‌నివారం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో స్టీల్ ప్లాంట్ కార్మికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని జ‌న‌నేత‌ను విజ్ఞ‌ప్తి చేశారు. గతంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్టీల్‌ప్లాంట్‌లో 50 శాతం ఉద్యోగాలు ఇచ్చి, నిర్వాసితులకు న్యాయం చేశారన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్  అధికారంలోకి వస్తుందని, స్టీల్‌ప్లాంట్‌ను కాపాడి ఉద్యోగులకు న్యాయం చేయాల‌ని విన‌తిప‌త్రం అంద‌జేశారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా క‌ల్పించారు.

తాజా ఫోటోలు

Back to Top