జననేత సీఎం అయితేనే రాష్ట్రం సస్యశ్యామలం

వైయస్ఆర్ జిల్లాః పులివెందుల ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్, పార్టీ నేతలు పాల్గొని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బాబు సీమను ఎడారిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే అభివృద్ధి
–అకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైయస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గాలేరు–నగరి ప్రాజెక్ట్‌ను 858 శాతం పూర్తి చేశారన్నారు. టీడీపీ మూడేళ్లలో మిగిలిన 15 శాతం పూర్తి చేయలేకపోవడంతో తాగునీరు, సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు కనీసం సొంతూరికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చకపోవడంతో చంద్రగిరి నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్‌ కుటుంటం పులివెందులకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే పోటీ చేస్తూ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తున్నారని తెలిపారు. నాయకుడంటే వైయస్‌ఆర్‌ లాగా ఉండాలని, ఆయన బాటలో నడుస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి టీడీపీ నేతలు నేర్చుకోవాలని సూచించారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే వైయస్‌ఆర్‌ జిల్లాకు నీరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
––––––––––––
ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఉద్యమిద్దాం
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా అందరం ఉద్యమిద్దామని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి  అసెంబ్లీలో మాట్లాడితే చంద్రబాబుకు హేళనగా మాట్లాడుతున్నారని చెప్పారు. టీడీపీ పాలనలో ఇప్పటికే మూడు బడ్జెట్లు పూర్తయ్యాయని, సీమ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గాలేరు–నగరి పనులు 85 శాతం పూర్తి చేస్తే..బాబు మూడేళ్లలో ఒక్క శాతం కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ఈ రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టలేదని అనుమానం వ్యక్తం చేశారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా..వైయస్‌ఆర్‌ జిల్లాకు నీళ్లు రావాలన్నా వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ఆకాంక్షించారు. గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం ద్వారా గ్రామాలకు వెళ్తే..ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారు. టీడీపీ నేతలకు సరైన జవాబు చెబుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ముందు బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఉద్యమించాలి. రాయలసీమ అభివృద్ధికి పోరాడుదాం.
–––––––––––
వైయస్ వివేకానందరెడ్డి( మాజీ మంత్రి, వైయస్సార్సీపీ సీనియర్ నేత)
శ్రీశైలం, కృష్ణాలో వాటర్ నిండుగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుగంగకు నీళ్లు ఇవ్వడం లేదు. గాలేరు నగరి ఫేజ్ వన్
ఒక సంవత్సరం చేస్తే పూర్తవుతుందని చెప్పినప్పటికీ వైయస్ఆర్ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. రోషయ్య, కిరణ్, బాబు ఏ పనులు  చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మనకు  న్యాయంగా రావాల్సిన నీటి కోసం మనం ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలి. ప్రభుత్వంపై తగిన ఒత్తిడి తెద్దాం. మన నాయకుడి ప్రయత్నాలకు చేయూత నిద్దాం. మన నాయకులు ఇప్పటికే ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బయట ఎన్నోసార్లు నిలదీయడం జరిగింది.  పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు హక్కుగా రావాల్సిన నీటిని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా అబద్ధాలు చెబుతోంది. మననీళ్లను సాధించుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలి. మాటలు చెప్పే మభ్యపెట్టే పరిస్థితి అన్నిసార్లు చేయలేరని బాబును హెచ్చరించారు. 

–––––––––––

 వైయస్‌ జగనన్న సీఎం అయితేనే రాష్ట్రం సస్యశ్యామలం
ఎంపీ మిథున్‌రెడ్డి
వైయస్‌ జగనన్న సీఎం అయితేనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 80 శాతం పనులు చేపడితే మిగిలన పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రాష్ట్రంలో నాయకత్వం మార్పు జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఇప్పటికే మూడేళ్లే కాలయాపన చేశారు. మిగిలిన రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయరని తెలుస్తోంది.  చంద్రబాబు ఆలోచన దోరణి మానాలి. ఎక్కడో రైలు తగులబెడితే పులివెందుల రౌడీలు అంటున్నారని మండిపడ్డారు. కడప జిల్లా కూడా ఏపీలో భాగమన్న విషయాన్ని సీఎం గుర్తించుకోవాలని సూచించారు.  ఏ వ్యక్తి అయితే రాయలసీమకు నీళ్లు రాకుండా చేసేందుకు ధర్నా చేశారో..ఆ వ్యక్తినే ఇరిగేషన్‌ మంత్రిని చేయడం దారుణమన్నారు. రాయలసీమకు న్యాయం జరగాలంటే నాయకత్వం మారాలని మిథున్‌రెడ్డి ఆకాంక్షించారు.  వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన రోజే కడప బాగుపడుతుంది. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. 
––––––––––––––
దమ్మున్న నాయకుడు వైయస్‌ఆర్‌
ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి
పులివెందులకు నీళ్లు రాకుండా ఎందరు అడ్డుపడినా దమ్మున్న నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపట్టారని ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ ఎన్నో ఏళ్లుగా తుంగభద్రపై ఆధారపడిందన్నారు. తుంగభద్ర నుంచి చిత్రావతికి నీటి పంపిణీ తగ్గుతోందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైయస్‌ఆర్‌ ఎవరూ ఉహించని విధంగా కృష్టా నీటిని పులివెందులకు తీసుకురావాలని పోతిరెడ్డిపాడు హెడురెగ్యులేటర్‌ నుంచి నీటిని తెచ్చేందుకు దాని కేపాసిటిని 44 వేల క్యూసెక్కులకు పెంచారన్నారు. నాడు దేవినేని ఉమా, టీఆర్‌ఎస్‌ నేతలు వైయస్‌ఆర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారన్నారు. అయినాసరే వీళ్ల మాటలు లెక్కచేయకుండా  దమ్మున్న నాయకుడిగా వైయస్‌ఆర్‌ కాలర్‌ ఎగురవేసి మా ప్రాంతానికి నీళ్లు తీసుకెకళ్లేందుకు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపడుతామని గట్టిగా చెప్పారన్నారు. ప్రజల రుణం తీసుకునేందుకు పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపట్టారని తెలిపారు. 

వైయస్ఆర్ కాకుండా ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదని అన్నారు. దాదాపు పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు 80 శాతం పనులు పూర్తి చేశారు. వైయస్‌ఆర్‌ మరణంతరం వచ్చిన ప్రభుత్వాలు పెండింగ్‌ పనులపై దృష్టి పెట్టడం లేదు. 600 క్యూసెక్కులు 2012లోనే వచ్చాయి. మన నియోజకవర్గంలో కూడా గండికోట , చిత్రావతి, పైడిపాలెం పనులు పూర్తి కాలేదు. ట్రైల్‌ రన్‌ చేసి మొక్కబడిగా నీళ్లు ఇచ్చారు. 6 టీఎంసీలు నింపీ పీబీసీ చివరి వరకు నీళ్లు ఇవ్వాలి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలి. 1700 అడుగుల బోర్లు వేస్తే గాని నీళ్లు పడటం లేదు. ఏమి ఇంత అన్యాయం. ఈ పనులు పూర్తి అయ్యింటే ఎప్పుడో భూగర్భజలాలు పెరిగేవి. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా కోరుదాం. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక ఈ పనులు పూర్తి చేసుకొని, భూగర్భజలాలు అభివృద్ధి చేసుకుందాం. చినీ చెట్లు ఎండి పోతున్నాయి. చిత్రావతికి 22వ తేది వరకు నీరు విడుదల చేయాలని కలెక్టర్లను కోరినా మన విన్నపాన్ని వినడం లేదు. ఇంకా మూడు వారాలు వచ్చి ఉంటే లింగాల కుడికాల్వకు నీళ్లు పారిఉంటే అరటి, చినీ తోటలు బతికేవి. తాగునీటి ఇబ్బందులు తొలిగేవి. నాలుగు వారాల తరువాత మళ్లీ ఇస్తామంటున్నారు. అప్పుడు ఇచ్చి ఏం లాభం. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని నీటి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. 2012 శనగ బీమా ఇంకా అందలేదు. ఈ ప్రభుత్వం ఇంతవరకు బీమా సొమ్ము చెల్లించకపోవడం దుర్మార్గం. పెండింగ్‌ బీమా మొత్తం ఇ ప్పటికైనా రైతుల ఖాతాల్లో జమా చేయాలి.
––––––––––––––––
భాస్కర్‌రెడ్డి, చౌటుపల్లి
సతీష్‌ రెడ్డి ఎందుకు గడ్డం పెంచడం లేదు. ఎవరో కట్టించిన ప్రాజెక్ట్‌కు ఆయన ఎందుకు గడ్డం పెంచారు. బాబు మాట తప్పితే ఎందుకు నిలదీయడం లేదు. ఆ దొంగలకు మరో దొంగ తోడయ్యారు. చౌటుపల్లిలో నెల రోజులుగా నీళ్లు లేవు. మమ్మల్ని తిప్పి తిప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బాబు ఎన్నికల్లో చెప్పిన హామీలు అన్ని విస్మరించారు. ఇది కూడా పట్టించుకోవడం లేదు. మా జగనన్న మా కోసం పోరాడాలని మేం కోరుతున్నాం.
––––––––––––––––
సుధీర్ రెడ్డి(జమ్మలమడుగు సమన్వయకర్త) 
జిల్లాకు తాగు, సాగు నీరందించాలన్న సదుద్దేశ్యంతో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం ప్రాంతంలో నీళ్లు నిలబెట్టేందుకు చేసిన కృషి వల్ల 13 గ్రామాల ప్రజలు త్యాగం చేశారని జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగం, పంటలు లేక విలవిలలాడుతున్న ఈ ప్రాంతంలో వ్యవసాయానికి అనువైన ప్రాంతంగా మలిచేందుకు వైయస్ఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. కానీ వైయస్ఆర్ మరణానంతరం మళ్లీ కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ప్రస్తుతం అందరం జగన్ అన్న ఆశతో బతుకుతున్నామన్నారు. బాబు పాలనలో ప్రస్తుతం ఆ13 గ్రామాల ప్రజలు నీళ్లలో మునిగిపోయారని, ఎక్కడ తలదాచుకోవాలనో కూడా తెలియడం లేదని అన్నారు. టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి అంత ప్యాకేజీ ఇస్తాం, ఇంత ప్యాకేజీ ఇస్తామని చెప్పడం తప్ప స్థానిక ప్రజలను ఆదుకున్న పాపాన పోవడం లేదని ఫైర్ అయ్యారు. చినుకులతో నీళ్లు చల్లిస్తామంటూ పంపుహౌస్ లతో బిల్లులు చేసుకుంటూ లంచాలకు పాల్పడుతున్నారని అన్నారు. పులివెందులకు నీళ్లిస్తానని చెప్పి బాబు మోసం చేశాడని పైర్ అయ్యారు. అది తెలుగుదేశం పార్టీ కాదని టోపీ దేశం పార్టీ అని ఎద్దేవా చేశారు.  మన జిల్లా నాయకుడు సీఎం అయితేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆరిపోయే దీపమని, వెలగబోయే దీపం మన జగనన్న అని చెప్పారు. ఇంకా రెండేళ్లు ఓపికపడితే దీపం వెలుగుతూనే ఉంటుందని అన్నారు.  
––––––––––––––––
గోవిందరెడ్డి(ఎమ్మెల్సీ)
దివంగత మహానేత వైయస్ఆర్ తో బాబును ఏవిధంగా పోల్చుకున్నా నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి కూడా నీటి రంగానికి కేవలం రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. ఐదేళ్లలో వైయస్ఆర్ రూ.55వేల కోట్లు ఖర్చుపెట్టారు. రాజశేఖర్ రెడ్డికి రైతులన్న రైతు కూలీలన్న, గ్రామ ప్రాంతాలన్న ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాయలసీమకు నీళ్లివ్వాలి, ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేయాలని చెప్పి ఎంత ఆవేదన పడ్డారో అందరికీ తెలుసు. వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాకముందు తెలుగుగంగ ప్రాజెక్ట్  ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. 2003లో వైయస్ఆర్ అన్ని ప్రాంతాలు తిరుగుతూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిచేస్తానని బ్రహ్మంగారి మఠం దగ్గర చెప్పారు. అధికారంలోకి వచ్చాక మూడేళ్లలో వేయి కోట్లు ఇచ్చి తెలుగుగంగను పూర్తిచేశారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీళ్లున్నప్పటికీ బ్రహ్మసాగర్ లోకి 5 టీఎంసీలు తెచ్చే పరిస్థితి లేదు. 14 టీఎంసీలు తెచ్చి బ్రహ్మసాగర్ నింపుతామన్నటీడీపీ నాయకులు అడ్రస్ లేకుండా పోయారు. అబద్ధపు మాటలు, ప్రచార ఆర్భాటం తప్ప రాయలసీమ అభివృద్ధిపై బాబు ఏమాత్రం చిత్తశుద్ధి  లేదు. ఆయన ప్రజానాయకుడు కాదు. మామను మోసం చేసి ముఖ్యమంత్రి అయిన వెన్నుపోటు దారుడికి వైయస్ కుటుంబానికి ఏమాత్రం పోలిక లేదు. వైయస్ జగన్  నాన్న అడుగుజాడల్లో నడుస్తూ రాయలసీమ, పులివెందుల అభివృద్ధికి కట్టుబడ్డారు. టీడీపీ వాళ్ల కళ్లబొల్లి మాటలు నమ్మొద్దని గోవిందరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. 


Back to Top