రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న రావాలి జగన్‌–కావాలి జగన్‌

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో రావాలి జగన్‌ కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. నగరం మండలం పెద్దవరం, తోటపల్లి, జిల్లేపల్లి గ్రామాల్లో నిర్వహించారు.వైయస్‌ఆర్‌సీపీ నేతలు కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి కష్టాలు తెలుసుకుని పార్టీ అ«ధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.నవరత్నాలు అందించి ప్రతి ఇంట వెలుగులు నింపుతామన్నారు. తెనాలిలో నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్‌ ఆధ్వర్యంలో జరిగింది. రాబోయే రోజుల్లో ఓటు హక్కుతో చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ నేత విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయ్‌ ఆధ్వర్యంలో జరిగింది. వైయస్‌ఆర్‌సీపీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో  వైయస్‌ఆర్‌సీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏపీలో రాక్షస పాలన సాగుతుందని, మహిళలకు రక్షణ కరువైందని బాలరాజు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో కావాలి జగన్‌–రావాలి జగన్‌  జగన్‌ కార్యక్రమం కొనసాగింది. భీమడోలు మండలం కొల్లేరు గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు వుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలని, రాబోయే రోజుల్లో జననేతకు ఓటు వేయాలన్నారు.
Back to Top