రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, ‌టిడిపిలదే

కడప :

రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టిడిపిలదే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తమ పదవులకు రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తూ కడపలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వై‌యస్ గె‌స్టుహౌస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కోటిరెడ్డి సర్కి‌ల్, ఎన్టీఆ‌ర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకుంది. పొట్టి శ్రీరాములు విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత మద్రాసురోడ్డు మీదుగా ప్రధాన తపాలా కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ వైయస్ఆర్ విగ్రహానికి భారీ పూలమాల వేసి అంజలి ఘటించారు.

‌ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని, విభజన అనివార్యం అచితే అన్ని ప్రాంతాలకూ సమన్యాయం జరగాలన్నదే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం అన్నారు.

సమైక్య రాష్ట్రం కోసం ఎలాంటి పోరాటానికైనా వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ వైయస్ఆర్ జిల్లా కన్వీన‌ర్ కె.సురే‌ష్‌బాబు తెలిపారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ‌మరణించిన తరువాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయిందన్నారు. 2009లో సమైక్యాంధ్ర కోసమే వైయస్ఆర్ ‌టిఆర్‌ఎస్‌ను దూరంగా ఉంచి ఒంటరిగా పోటీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయాల కోసమే విభజన చేస్తోందని ధ్వజమెత్తారు.

‌పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. సీమాంధ్రలోని కొందరు నాయకులకు సోనియా మంత్రి పదవులను ఎరగా వేసి వారి నోరు మూయించిందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలకైనా తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top