మహాత్మా జ్యోతిరావు పూలేకు జగన్ నివాళి

హైదరాబాద్‌ :

వెనుకబడిన తరగతులు, మహిళల అభ్యున్నతికి జీవితాంతం పాటుపడిన మహాత్మా జ్యోతిరావ్ పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. పూలే చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో సహా పలువురు హాజరయ్యారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో : వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా పూలే చిత్రపటానికి పార్టీ నేతలు పలువురు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పి.ఎన్.వి.ప్రసాద్, సీహెచ్ కృష్ణారావు, చల్లా మధుసూద‌న్‌రెడ్డి, డాక్టర్ ప్రపుల్లరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర నేతలు సతీ‌శ్‌గౌడ్, దశరథ్‌గౌడ్, సురేశ్‌గౌడ్ పాల్గొని పూలేను స్మరించుకున్నారు.

‌ఈ సందర్భంగా గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు దేశంలో ఒక దిశను నిర్దేశించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. మహిళల విద్య కోసం ఎనలేని కృషి చేయడమే గాక తన సతీమణినే తొలి ఉపాధ్యాయినిగా ఫూలే తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పూలే, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ వంటి మహనీయుల ఆశయాల‌ కోసం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

Back to Top