మోసపూరిత సర్వేలు మానండి

అన్ని విధాలుగా ప్రభుత్వం వైఫల్యం
ఏమీ చేయకుండానే అన్నీ చేశామని ఫేక్ సర్వేలు
టీడీపీపై శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.  ప్రభుత్వ పథకాల అమలుపై సర్వే చేసినట్టు లీకులిచ్చి టీడీపీ సర్కారు వార్తలు రాయించుకుందని ఆరోపించారు.18 అంశాలపై సర్వే చేస్తే కనీసం మూడో వంతు ప్రజలు కూడా సంతృప్తిగా లేరని వెల్లడించారు. అన్నింటిలో వైఫల్యం చెంది అడ్డగోలు లెక్కలు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మోసపుచ్చే సర్వేలు మానుకుని ప్రజలకు మంచి పనులు చేయాలని హితవు పలికారు.

రాష్ట్రంలో ఎర్రచందనం దోపిడీలో, ఇసుక మాఫియాలో, కాల్ మనీ కేసులో నిజాయితీగా విచారణ చేపడితే ఎంతమంది తెలుగుతమ్ముళ్లు ఉన్నారో బయటపడుతుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సర్వేలు న్యాయబద్ధంగా ఉండాలని గానీ, ప్రజలను మభ్యపెట్టేవిధంగా కాదని హితపు పలికారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కాల్ మనీ కేసులో మహిళల మాన ప్రాణాలను దోచుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిన్సియర్ గా పనిచేసే అధికారులను ట్రాన్స్ పర్లు, బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయంలో అర్హులైన లబ్దిదారులందరికీ పింఛన్లు అందించారని..కానీ, చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంతవరకు డ్వాక్రామహిళలకు రుణాల మాఫీ మొదలుపెట్టని చంద్రబాబు ఛేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ తో వైఎస్సార్సీపీ ములాఖత్ అయిందని అసెంబ్లీలో అర్థం లేని ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బెజవాడలో కోడి , మఠాన్ పలావ్ లు రొయ్యలు వడ్డించుకొని తింటూ కేసీఆర్, చంద్రబాబులు ఏకాంతంగా ఏమాట్లాడుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర సమస్యలపై దృష్టిపెట్టి ప్రజలను ఆదుకోవాలన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top