చంద్రబాబు పతనానికి తెలంగాణలో నాంది

కాంగ్రెస్, టీడీపీ పొత్తును ప్రజలు అసహ్యించుకున్నారు
ఏపీలో దోపిడీ చేసిన రూ.12 వందల కోట్లు వెదజల్లారు
చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతో కాంగ్రెస్‌ పతనం
ఏపీ సీఎం తెలంగాణలో కాంగ్రెస్‌ కోశాధికారిగా పనిచేశారు
చంద్రబాబు ఆటలో లగడపాటి శకునిలా మాయాపాచికలు విసిరారు
ప్రజలంతా మహాకూటమికి తగిన గుణపాఠం చెప్పారు
హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పతనానికి తెలంగాణలో నాంది పడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అనైతిక పొత్తు అసహ్యమైనదని తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారన్నారు. ఏపీలో అవినీతిగా సంపాదించిన డబ్బు రూ. 12 వందల కోట్లకుపైగా తీసుకొచ్చి తెలంగాణలో వెదజల్లిన చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ తెలంగాణలో పోటీ చేయలేదని, ఏ రాజకీయ పక్షానికి మద్దతు పలకలేదన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు ఉన్నా.. దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రీకరించామన్నారు.  

తెలుగుదేశం పార్టీ పొత్తుతో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన మహాకూటమి మహా ఓటమిని చవి చూసిందని అంబటి అన్నారు. ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు కలిసి కూటమి ఏర్పాటు చేసుకోవడం అనాధిగా వస్తున్నా.. కాంగ్రెస్, టీడీపీ కలయిక అసహ్యమైందని ప్రజలు నిరూపించారన్నారు. గత ఎన్నికల్లో 63 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం అంతకు మించిన స్థానాల్లో విజయం సాధించిందన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా.. అది చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత కంటే తక్కువేనని ప్రజలు భావించి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టబోతున్నారన్నారు. కూటమి ఓటమి మంచి పరిణామన్నారు. అనైతిక పొత్తులు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారన్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ హామీలు నెరవేర్చలేదని మాట్లాడిన చంద్రబాబు ఏపీలో 600 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చేలేదు కానీ ఇక్కడ నీతులు మాట్లాడుతున్నాడని ప్రజల్లో ఆలోచన ఉండబట్టే విజయం వరించిందన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కోశాధికారిగా వ్యవహరించారని అంబటి అన్నారు. ఓటుకు కోట్ల కేసులో రూ. 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని చంద్రబాబే స్వయంగా కాంగ్రెస్‌లోకి చేర్చారని, తరువాత బాబు డబ్బు మూటలు తీసుకొచ్చి ఇచ్చారన్నారు. చంద్రబాబు కూటమిలో లేకుండా ఉండి ఉంటే కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు వచ్చేవన్నారు. హైదరాబాద్‌ సృష్టికర్తనని చెప్పుకునే చంద్రబాబును ప్రజలు తిప్పి పంపించారన్నారు. 

తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్‌ చిత్ర విచిత్రమైన పాత్రలు వేశాడని అంబటి అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ సన్యాసం అని ప్రకటించిన లగడపాటి సెఫాలజిస్టు అవతారం ఎత్తాడన్నారు. చంద్రబాబు ఏ విధంగా వ్యవస్థలను వాడుకొని నిర్వీర్యం చేస్తాడో ప్రజలందరికీ తెలుసన్నారు. సుజనా చౌదరి, విజయ్‌ మాల్యాలా దేశం వదిలి ఎప్పుడు పారిపోతాడో తెలియని  దివాలా తీసిన వ్యాపారి లగడపాటిని ఉపయోగించి సర్వేల పేరుతో ఓటర్లను ప్రభావితం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నాడన్నారు. కూటమి గెలిపించాలనే ఉద్దేశంతో కొన్ని పత్రికలు లగడపాటిని వీరుడు అన్నట్లుగా చూపించాయన్నారు. వెయ్యి మర్డర్ల కన్నా ఘోరమైన తప్పిదం ప్రజల మనోభావాలని మర్చాలని తప్పిదం చేశారన్నారు. చంద్రబాబు ఆడిస్తుంటే శకునిపాత్రలో లగడపాటి మాయాపాచికలు విసిరి గెలివాలని చూశారన్నారు. ఇలాంటి నీచ ఆలోచనలు చేసే వ్యక్తులను ప్రజలకు సహించకూడదన్నారు. టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని చెబుతూనే టీఆర్‌ఎస్‌ వైపు నుంచి లగడపాటి బెట్టింగ్‌లు కట్టించారనే భావనం కలుగుతుందని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేయించాలన్నారు. నిన్న ఢిల్లీ వెళ్లి సేవ్‌ డెమోక్రసీ అని మాట్లాడుతున్న చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశాడన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, వ్యవస్థలు, రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కూడా లేదన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top