రాజన్న రాజ్యంతోనే అభివృద్ధి

ప్రతి గుండెలో కొలువైన మహానేత
ప్రజల మనసు గెలిచిన ముఖ్యమంత్రి

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజానాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఎండనకా, వాననకా ప్రతి పల్లెల్లో తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకున్న మహానేత. విద్యార్థులు, యువకులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, రైతులు, కూలీలు, శ్రామికులు, కార్మికులు తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారు. రుణమాఫీ, ఉచితవిద్యుత్, పావలా వడ్డీ, అభయహస్తం, వృద్ధాప్యపింఛన్లు, పక్కాగృహాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను..అనుకున్న దానికంటే ఎక్కువే అందించారు. జలయజ్ఞంతో రైతన్నకు ఊపిరి పోసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. 

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి..ప్రతి పేదవాడిని అబివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఆ మహానేత ఆశించేవారు. మన ప్రజలు బాగుండాలి వారి మొములో చిరునవ్వులు చూడాలని పరితపించేవారు. దీనిలో భాగంగానే ఊహకందని విధంగా అభివృద్ధి చేసి చూపించారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని భావి తరాలకు తెలియజెప్పారు. ప్రజల గుండెల్లో ప్రజానాయుకుడిగా సుస్థిర స్థానం సంపాదించారు. ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి మరణించి ఆరేళ్లయ్యినా ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారంటే ఆయన అమలు చేసిన  సంక్షేమ పథకాలే  అందుకు నిదర్శనం. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ..వచ్చిన ముఖ్యమంత్రులు, ప్రస్తుత అధికార పార్టీలు సంక్షేమ పథకాలను తుంగలో తొక్కాయి. ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రాజన్న కలల రాజ్యాన్ని నిర్మించుకునేందుకు....ఆయన తనయుడు  వైఎస్ జగన్ రాజశేఖరుడి ఆశయాలతో వైఎస్సార్సీపీ రూపంలో ప్రజల ముందుకు వచ్చారు. మహానేత హఠాన్మరణాన్ని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఆదుకుంటానని వైఎస్ జగన్ నల్లకాల్వ దగ్గర మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేసి జైల్లో పెట్టినా టీఆర్ఎస్ జిమ్మిక్కులు చేసినా లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  

Back to Top