జననేత స్ఫూర్తితో విద్యార్థుల్లోకి ప్రత్యేక హోదా అంశం

పెనుకొండ: వైయస్‌ఆర్‌ సీపి అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి స్ఫూర్తితో ప్రత్యేక హోదా అంశాన్ని విద్యార్థుల్లోకి తీసుకువెళుతామని వైయస్‌ఆర్‌ విద్యార్థి విభాగం నాయకులు శివకుమార్, కోగిర చరణ్‌ తదితరులు పేర్కొన్నారు. పట్టణంలో గురువారం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ....  ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగాలు అధికంగా వస్తాయని,  అయితే సీఎం చంద్రబాబునాయుడు దీనిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్‌ బాటలో నడిచి ప్రత్యేక హోదా అంశాన్ని విద్యార్థుల్లోకి తీసుకువెళుతామన్నారు. రాష్ట్ర రూపురేఖలు మార్చివేసే ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చొరవచూపాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేసారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సాయికుమార్‌నాయక్, నాగార్జున, ఫయాజ్, అనిల్, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top