ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందే

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం మంగళవారం రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదాపై వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని సభ సాక్షిగా ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని  విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల కంటే ఏపీ వెనుకబడి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందిన సాయం చాలా తక్కువని తెలిపారు. ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయసాయిరెడ్డి సభలో నిరసన తెలిపారు. ప్రత్యేకహోదాపై చర్చ సమయంలో టీడీపీ ఎంపీలు లేకపోవడంపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. 

Back to Top