బిసి అధ్యయన కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం


హైదరాబాద్  : వైయస్ఆర్ సీపీ  బిసి అధ్యయన కమిటీ లో  ప్రత్యేక ఆహ్వానితులుగా పలువురు నాయకులను నియమించారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్లు పార్టీ కేంద్రం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని బిసి వర్గాల సమస్యలను అధ్యయనం చేయడంతో పాటు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ బిసి డిక్లరేషన్ రూపకల్పన కోసం పార్టీ తరపున కొద్ది కాలం క్రితం ప్రత్యేకంగా కమిటీ నియమించిన సంగతి తెలిసిందే.  కమిటీలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన బోయ తిప్పేస్వామి, గుంటూరు జిల్లాకు చెందిన లలిత్ కుమార్ , వైయస్ ఆర్ కడప జిల్లాకు చెందిన శ్రీ ప్రసాద్ లను ప్రత్యేక  ఆహ్వానితులుగా నియమించారు.
Back to Top