వీడియో క్లిప్పింగ్ లు ఇవ్వవద్దని చెప్పా: స్పీకర్ కోడెల

హైదరాబాద్: అసెంబ్లీ నుంచి సోషల్
మీడియాకు వీడియో క్లిప్పింగ్ లు విడుదల కావటం మీద వాదనలు రక రకాలుగా
వినిపిస్తున్నాయి. వీటిని బయటకు ఇవ్వవద్దనే తాను చెప్పానని స్పీకర్ కోడెల
శివప్రసాద్ రావు అన్నారు. కానీ బయటకు వచ్చి సోషల్ మీడియాలో
ప్రచారం అయ్యాయని అన్నారు. ఇది బాధ్యతారాహిత్యం, దురదృష్టకరమని
చెప్పారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన
మీడియాతో మాట్లాడారు.

దీనిపై తాను విచారణ ప్రారంభించగా, మూడు నాలుగు వెర్షన్లు చెప్పారన్నారు. సభలో నుంచి బయటకు సీడీల
రూపంలో లీకై ఉండాలి, లేదా
ఫోన్లు.. ఐప్యాడ్లతో రికార్డు చేసి ఉండాలని తెలిపారు. ఈ క్లిప్పింగులు ఎలా బయటకు
వెళ్లాయన్నదానిపై విచారణ చేయాల్సి ఉందని అన్నారు.తాను ఎవరికీ క్లిప్పింగులను బహిర్గతం చేయమని చెప్పలేదు, చేయొద్దనీ అనలేదని స్పష్టం చేశారు.

 ఎమ్మెల్యే
రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ
స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల క్లిప్పింగులు సోషల్
మీడియాలో ఎలా బయటకు వచ్చాయో తనకు తెలియదని, దానిపై
విచారణ చేయిస్తున్నానని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఒక కమిటీ వేస్తున్నానని, దీనికి డిప్యూటీ స్పీకర్ చైర్మన్‌గా ఉంటారని అన్నారు. మూడు
పార్టీల నుంచి ముగ్గురు సభ్యులు ఉంటారని తెలిపారు.. 

Back to Top