సోమవారంనాటి షర్మిల పాదయాత్ర సాగేదిలా..

గుంటూరు 25 ఫిబ్రవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్. షర్మిల సోమవారం నాడు గురజాల, మాచర్ల నియోజకవర్గాలలో పాదయాత్ర సాగిస్తారు. అధికార కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలకూ, వాటికి వంతపాడుతున్న చంద్రబాబు వైఖరికీ నిరసనగా చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం శనివారంనాడు నల్గొండ జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. సోమవారంనాటి పాదయాత్ర వివరాలను వైయస్ఆర్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా కమిటీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురామ్ వివరించారు. గురజాల నియోజకవర్గంలో బసచేసిన ప్రాంతంనుంచి బయలుదేరి అక్కడికి కిలోమీటరు దూరంలోగల తక్కెళ్లపాడుకు శ్రీమతి షర్మిల చేరుకుంటారని తెలిపారు. అక్కడినుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారన్నారు. అనంతరం మాచర్ల నియోజకవర్గం కాచవరం, ఇనపరాజుపల్లి, గాదెవారిపల్లి మీదుగా రాత్రి బస ప్రాంతానికి చేరుకుంటారని పేర్కొన్నారు.

Back to Top