తక్షణమే ప్రజల సమస్యలు పరిష్కరించండి

నెల్లూరుః వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నగరంలోని 52వ డివిజన్ లో పర్యటించి ప్రజల స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రంగనాయకులపేటలో డ్రైనేజీ కాలువల నిర్మాణం కోసం తవ్విన గుంటలు అలాగే వదిలేయడంపై మండిపడ్డారు. సంతపేట నుంచి వచ్చే మురికినీరు తాగునీటిలో కలిసిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. వారంలోగా కాలువల నిర్మాణం పూర్తిచేయడంతో పాటు, వాటర్ పైప్ లైన్ల లీకులను సరిచేసి రెండ్రోజుల్లోగా ప్రజలకు తాగునీరు అందించాలని అధికారులకు సూచించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. 

కాంట్రాక్టర్లు కూడ కాలువ పనులు మొదలుపెట్టిన తర్వాత వాటిని అలా వదిలేయకుండా వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు.  అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంగా పనిచేసి ప్రజలు అసౌకర్యాలకు గురికాకుండా చూడాలన్నారు. 
ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. కార్యక్రమలో కార్పొరేటర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు. 
Back to Top