ఉత్తరాంధ్ర ముంపు ప్రాంతాలకు విజయమ్మ

శ్రీకాకుళం :

భారీ వర్షాలు, వరదల వల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఈ నెల 30న వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పర్యటి‌స్తారని పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు సోమవారం తెలిపారు. గార, పోలాకి మండలాలతో పాటు శ్రీకాకుళం పట్టణంలో నీటిలో మునిగి ఉన్న ప్రాంతాల్లో శ్రీమతి విజయమ్మ పర్యటించి బాదితులను పరామర్శిస్తారని ఆయన వివరించారు.

విజయమ్మ పర్యటనను విజయవంతం చేయండి: కృష్ణదాస్ :
పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ శ్రీకాకుళం జిల్లాలో చేయనున్న పర్యటనను విజయవంతం చేయాలని ఎ‌మ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముంపునకు గురైన ప్రాంతాల్లోని బాధితులను ఆదుకోవడంలోను, నష్టాలను అంచనా వేయటంలోను అధికార యంత్రాంగం విఫలమైందని ఆయన ‌విమర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top