షర్మిల మరో ప్రజాప్రస్థానం తుదిరోజు సాగేదిలా

ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా),

4 ఆగస్టు 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 230వ రోజు ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని గుడ్డిభద్ర సమీపం నుంచి ప్రారంభం అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీమతి షర్మిల 15వ రోజు - చివరి రోజు పాదయాత్ర చేస్తారు. ఆదివారం నాటి శ్రీమతి షర్మిల పాదయాత్ర వివరాలను కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీన‌ర్ ధర్మాన పద్మప్రియ ‌తెలిపారు.

శనివారం రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే శ్రీమతి షర్మిల పాదయాత్ర.. బలరాంపురం, సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి గ్రామాల మీదుగా కొనసాగుతుంది. భోజన విరామం తర్వాత శ్రీహతి షర్మిల..  ఇచ్ఛాపురం పట్టణానికి చేరుకుంటారు. ఇచ్ఛాపురంలో జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Back to Top