షర్మిల గురువారం పాదయాత్ర 15 కిలోమీటర్లు

విశాఖపట్నం, 4 జూలై 2013:

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్ర 199వ రోజు గురువారం ఉదయం గాజువాక సెంటర్‌ నుంచి ప్రారంభమైంది. శ్రీమతి షర్మిల పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ‌ శ్రీనివాస్ వెల్లడించారు. గాజువాక సెంటర్‌ నుంచి శ్రీమతి షర్మిల నాతయ్యపాలెం, షీలానగర్, విశాఖపట్నం విమానాశ్రయం‌ వరకూ పాదయాత్ర చేస్తారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఆమె మధ్యాహ్న భోజనానికి ఆగుతారని రఘురాం, శ్రీనివాస్‌ తెలిపారు. భోజన విరామం తరువాత శ్రీమతి షర్మిల ఎన్ఎడి కొత్తరోడ్డు జంక్షన్, బుచ్చిరాజుపాలెం, మర్రిపాలెం, ఐటీ జంక్షన్, కంచరపాలెం మెట్టు వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. గురువారంనాడు మొత్తం 15 కిలోమీటర్లు నడిచి కంచరపాలెంమెట్టు సమీపంలో రాత్రికి బసచేస్తారు.

తాజా వీడియోలు

Back to Top