కిర్లంపూడి నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

కిర్లంపూడి, 19 జూన్‌ 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారానికి 184వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం ఆమె తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి యాత్రను ప్రారంభించారు. ప్రత్తిపాడు, రమణ మహర్షి ఆశ్రమం, రాచపల్లి క్రాస్‌రోడ్‌ వరకూ 5.9 కిలోమీటర్ల నడుస్తారు. అక్కడే శ్రీమతి షర్మిల మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.

భోజన విరామం తరువాత శ్రీమతి షర్మిల రాచపల్లి మీదుగా ఒమ్మంగి వరకూ 8.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. ఒమ్మంగి తరువాత బుధవారం రాత్రికి ఆమె బస చేస్తారు. శ్రీమతి షర్మిల బుధవారం మొత్తం 14.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది.

Back to Top