'బొబ్బిలి'లో ప్రవేశించిన షర్మిల పాదయాత్ర

బొబ్బిలి (విజయనగరం జిల్లా),

17 జూలై 2013: దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారంనాడు బొబ్బిలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఆరికతోట వద్ద బొబ్బిలి నియోజకవర్గంలో అడుగుపెట్టిన శ్రీమతి షర్మిలకు తాజా మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు స్వాగతం పలికారు.

అంతకు ముందు బూర్జవలసలో గొర్రెల కాపరుల సమస్యలను శ్రీమతి షర్మిల అడిగి తెలుసుకున్నారు. తమకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయడంలేదని ఇన్సూరెన్సు కూడా ఇవ్వడంలేదని గొర్రెల కాపరులు ఆమె ముందు మొరపెట్టుకున్నారు. బూసాయవలస, రామభద్రపురం మీదుగా నేడు శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.

Back to Top