తనకల్లు: మండల పరిధిలోని బాబేనాయక్‌తండాలో నిర్మించిన మారెమ్మ గుడికి వైయస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి రూ. 10 వేలు ఆర్థిక సాయం చేశారు. మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి చేతుల మీదుగా ఆ మొత్తాన్ని కమిటీ సభ్యులు రమేష్‌నాయక్, శ్రీనివాసులనాయక్, బాలాజీనాయక్‌కు అందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తబ్రేజ్, బాబు, వినోద్, నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.<br/>