శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం

విజయవాడ: శిల్పా చక్రపాణిరెడ్డి తన శాసన మండలి సభ్యత్వానికి చేసిన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శి ఆమోదించారు. నైతిక విలువలు కాపాడాలనే వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచనల మేరకు చక్రపాణిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి ఈ నెల 3న రాజీనామా చేసి వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పది రోజుల వ్యవధిలోనే ఆయన రాజీనామాను ఆమోదించారు. సుదీర్ఘకాలంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్‌ పెండింగ్‌లో ఉంది.

Back to Top