షర్మిల పాదయాత్ర విజయవంతానికి కృషి

కాగజ్‌నగర్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపడుతున్న పాదయాత్ర విజయవంతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ అన్నారు. కాగజ్‌నగర్ ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో షర్మిల చేపడుతున్న పాదయాత్ర ఈ నెల 23న తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లోకి ప్రవేశిస్తుందన్నారు. మహబూబ్‌నగర్ పాదయాత్రకు తరలేందుకు జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. వైయస్ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. ప్రాజెక్టు పరిశీలనకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ డిసెంబర్‌లో సిర్పూర్ నియోజకవర్గానికి రానున్నట్లు తెలిపారు.

Back to Top