షర్మిల పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ గల్లంతు

తల్లాడ:

తెలంగాణలో షర్మిల పాదయాత్ర ముగిసేలోపే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గల్లంతవుతుందని వైయస్‌ఆర్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ చెప్పారు. తల్లాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షర్మిల పాదయాత్రతో రాష్ట్ర రాజకీయల్లో పెను సంచలనం కానుందన్నారు. తెలంగాణలో పాదయాత్ర ముగిసేలోగా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోయి ఎన్నికలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.  విశ్వసనీయతకు మారుపేరైన వైయస్ జగన్‌ను కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా జైలులో పెట్టిందన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కోల్పోయారని అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు స్పందన కరవైందన్నారు.

Back to Top