<strong>దేవరకద్ర (మహబూబ్‌నగర్ జిల్లా):</strong> దేవరకద్ర నియోజకవర్గంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలక మండలి సభ్యురాలు వి. బాలమణెమ్మ అన్నారు. నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర ముగిసిన సందర్భంగా దేవరకద్రలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రలో ప్రజలు పాల్గొని అడుగడుగునా నీరాజనాలు పలికారని అన్నారు. పాదయాత్ర మార్గమధ్యంలో వచ్చే ప్రతి గ్రామంలో ఘనస్వాగతం పలికారని గుర్తుచేశారు. శ్రీమతి షర్మిల పాదయాత్రతో కాంగ్రెస్, టిడిపిలు తమ దుకాణాలను మూసుకోవడం ఖాయమన్నారు. జగనన్న అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. షర్మిల పాదయాత్రను విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కళాశాల విద్యార్థులతో కలిసి సమస్యలపై షర్మిలకు వినతిపత్రం సమర్పించారు.<strong>భారీ ర్యాలీ:</strong>బాలమణెమ్మ, సిఈసి సభ్యుడు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక పాతబస్టాండు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం వీరంతా తరలివెళ్లి షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్ సిపి మండల కన్వీనర్ కృష్ణంరాజు, నర్వ శ్రీనివాస్‌రెడ్డి, యువజన విభాగం మండల కన్వీనర్ రవికాంత్‌రెడ్డి, మోసిన్‌ఖాన్, ఇనాయత్ అలీ, ఖాజా పాష, హోటల్ దాసు, వెంకటేశ్, జి.రాములు, విద్యాసాగర్, షఫి, కరుణాకర్, అనిల్, ప్రేమ్‌కుమార్, మల్లేశ్వరి, బాబు, క్రాంతి, రమేశ్ చారి, రాంపండు, రామాంజనేయులు, చెన్నప్ప, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.