షర్మిలకు గద్వాలలో ఘన స్వాగతం

గద్వాల (మహబూబ్ నగర్ జిల్లా):

దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం'  పాదయాత్రకు మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారీగా తరలి వచ్చిన జన సందోహంతో పట్టణ వీధులన్నీ కిక్కిరిసి పోయాయి. మేడలు, మిద్దెల మీద... ఎటూ చూసినా జనమే కనిపించారు. పట్టణ పుర వీధుల్లో దారి పొడవునా జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

వైయస్ఆర్ కడప జిల్లాలో అక్టోబర్ 18న ప్రారంభమైన షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 41 రోజులు పూర్తి చేసుకుంది. పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర మంగళవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది.  మంగళవారం నాటికి షర్మిల పాదయాత్ర 554 కిలో మీటర్లు కొనసాగింది.

Back to Top