వైఎస్ షర్మిల మలివిడత పరామర్శయాత్ర..!

వరంగల్ః ప్రియతమనేత దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల..21 నుండి వరంగల్ జిల్లాలో మూడో విడత పరామర్శయాత్ర చేపట్టనున్నారు. మొత్తం 11 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటన అనంతరం కరీంనగర్ లో షర్మిల పరామర్శయాత్ర చేపడుతారని రాఘవరెడ్డి ప్రకటించారు. మంథని నియోజకవర్గంలో మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభమవుతుందని..జిల్లాలో మొత్తం 12 కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు షర్మిల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 13 నియోజకవర్గాల్లో 62 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. అండగా ఉంటామని భరోసానిస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు.  
Back to Top