వైయ‌స్ జ‌గ‌న్ మూడవ రోజు టూర్ షెడ్యూల్‌

పులివెందుల‌) ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. మూడవ రోజు వివిధ గ్రామాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. లింగాల మండ‌లం పెద్ద కూడ‌ల గ్రామానికి ఉద‌యం 11 గంట‌లకు చేరుకొంటారు. అక్క‌డ ఆత్మ‌హ‌త్య చేసుకొన్న మంజుల చ‌ల‌ప‌తి కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తారు. త‌ర్వాత చ‌క్రాయ‌పేట మండ‌లం ముద్ద‌ప్ప‌గారి పల్లికి వెళ‌తారు. అక్క‌డ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం పొందిన ఎస్ . చెన్నారెడ్డి కుటుంబ‌స‌భ్యుల్ని ప‌రామ‌ర్శిస్తారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయా గ్రామాల్లో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల్ని ఆయ‌న క‌లుస్తారు. 

రేపు దివంగ‌త మ‌హానేత వైయ‌స్సార్ జ‌యంతి కార్య‌క్ర‌మాల్లో వైయ‌స్ జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా పాల్గొన‌నున్నారు. ఇడుపుల పాయలోనే గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్సీపీ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. 
Back to Top