వైయ‌స్‌ జగన్‌ సీఎం కావాలని యువకుడి పాదయాత్ర

 

 నల్గొండ : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావాలని సతీష్‌ అనే యువకుడు హైదరాబాద్‌ నుంచి విజయవాడ కనక దుర్గమ్మ గుడికి పాదయాత్రగా బయలుదేరారు. హైద‌రాబాద్‌లోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి మంగళవారం పాదయాత్రగా బయలుదేరి నార్కెట్‌ పల్లికి చేరుకున్నారు. ప్రస్తుతం కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్న సతీష్‌ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. 

దివంగత సీఎం వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సమయంలో ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు ఉపయోగపడుతున్నాయని సతీష్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయడం లేదని, ఎక్కడ చూసినా అవినీతి ఎక్కువైపోయిందని మండిపడ్డారు. వైయ‌స్‌ జగన్‌ సీఎం అయితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, పేదలకు పెన్షన్లు, ఇళ్లు వస్తాయని, అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top