శనివారం పాదయాత్ర 11.3 కిలోమీటర్లు

హైదరాబాద్, 20 అక్టోబర్ 2012 : షర్మిల మూడోరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర వైఎస్‌ఆర్‌ జిల్లాలోని భూమయ్యగారి పల్లె క్రాస్‌ వద్దనుంచి శనివారం ఉదయం ప్రారంభమయింది. అక్కడికి కిలోమీటరు దూరం ఉన్న వేల్పులకు  పాదయాత్ర ఉదయం 11.20 గంటలకు చేరుకుంది.. అక్కడి నుంచి బెస్తవారి పల్లెకు 2.8 కిలోమీటర్లు సాగుతుంది. బెస్తవారి పల్లె నుండి 5 కిలోమీటర్లు నడచి పులివెందుల ఆర్టీసీ బస్టాండ్‌ చేరుతుంది. ఆ తర్వాత పూల అంగళ్ల సర్కిల్‌ మీదుగా పార్నపల్లె రోడ్డు రింగ్‌రోడ్‌సర్కిల్‌ డాక్టర్ వైయస్ఆర్‌ స్వగృహం దాకా 2.5 కి.మీలు షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత ఋషి స్కూల్‌లో షర్మిల రాత్రికి బస చేస్తారు. శనివారంనాటి పాదయాత్ర మొత్తం 11.3 కిలోమీటర్ల దూరం సాగుతుంది.

తాజా వీడియోలు

Back to Top