మీడియా మేనేజ్‌ తప్ప మేలు చేయాలనే చిత్తశుద్ధి లేదు

ఢిల్లీ: చంద్రబాబు బుద్ధి మీడియాను ఎలా మేనేజ్‌ చేయాలనే తప్ప.. రాష్ట్రానికి మేలు చేయాలనే చిత్తశుద్ధి లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అంశం అని.. వైయస్‌ జగన్‌ పోరాటం తీవ్రతరం చేసి పోరాటం తుదిదశకు తీసుకువచ్చారన్నారు. ఎంపీల దీక్షా ప్రాంగణం వద్ద సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా దిశగా రాష్ట్రాన్ని నడిపి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు హోదా ఆవశ్యకతను వివరించిన ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. 15 రోజులుగా పార్లమెంట్‌లో అనేక విధాలుగా పోరాటం చేస్తూ.. 13 రోజులు వరుసగా కేంద్రంపై వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. దేశ చరిత్రలోనే మొదటి సారి ఎంపీలంతా రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చున్నారన్నారు. ఎంపీలది అత్యున్నత త్యాగమన్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి.. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముంచేసి. కేంద్రం నుంచి రావాల్సిన అంశాలను సాధించలేకపోయిన పచ్చి అసమర్థుడు చంద్రబాబు అన్నారు. 
 
Back to Top