నెల్లూరు జిల్లా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. వెంకటాచలం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పాల్గొని సంతకాలు సేకరించారు. అంతకుముందు మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గొలగమూడి జాతీయ రహదారి నుంచి వెంకటాచలం మండల కేంద్రం వరకు వందలాది మోటార్ బైకులతో ర్యాలీ చేపట్టారు. ప్రజలకు కోటి సంతకాల సేకరణ పట్ల అవగాహన కల్పించారు. ప్రజలు స్వచ్చందంగా పాల్గొని సంతకాలు చేసి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.