'సహకార' వాయిదాపై అమరనాథరెడ్డి ధ్వజం

చిత్తూరు:

మదనపల్లె డివిజన్ పరిధిలో నామినేషన్ల ప్రక్రియ జరిగే రోజున ప్రభుత్వం పలు సింగిల్ విండోలకు ఎన్నిక లు జరగకుండా స్టే విధించడంవల్ల కాం గ్రెస్, టీడీపీ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయాయని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి విమర్శించారు. బెరైడ్డిపల్లె సింగిల్ విం డో ఎన్నికలకు సంబంధించి నామినేష న్లు వేయడానికి వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు వందల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు అధికారులు తెలపడంతో ఆగ్రహించిన వైయస్ఆర్ సీపీ నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల వాయిదాను నిరసిస్తూ బెరైడ్డిపల్లెలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక నాలుగు రోడ్ల కూడలివద్ద పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ధర్నానుద్దేశించి ఎ మ్మెల్యే మాట్లాడుతూ సింగిల్‌విండో ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వా న్ని ఏ పార్టీ అడగలేదనీ, ప్రభుత్వమే ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందనీ చెప్పారు. ఈ నేపథ్యంలో మదనపల్లె డివిజన్‌లో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో తమ పార్టీకి బలమున్న పలు సింగిల్ విండోల్లో ఎన్నికలు జరగకుండా స్టే ఇవ్వడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని చెప్పారు.

Back to Top